నామం | అంతరార్థము |
---|---|
జననః జనజన్మాదిః భీమః భీమపరాక్రమః |
ప్రాణులను సృష్టించిందీ అదే - సృష్టించి వాటి జన్మను ఆది+ కబళించేదీ అదే, సంసార భయాన్ని నెత్తిన పడవేసేదీ అదే. భయంకరమైన పరాక్రమంతో దాన్ని నిర్మూలించి వీడిని కడతేర్చేదీ అదే. |
ఆధారనిలయః ఆధాతా |
ఆధారంలో లయింపచేసేదీ అదే ఆధారాని కాధారమై దాన్ని ధరించేదీ అదే. |
పుష్పహాసః ప్రజాగరః |
అధిష్ఠానంగా ఉంటూ తన మహాశక్తి అనే పుష్పం వికసించి (హాస) అదే ప్రపంచమనే ఫలంగా మారి భాసిస్తున్న వాడా ఈశ్వరుడు. అయినా ఏ భూమికలోనూ విస్మృతి లేని జాగృతి కలవాడు. |
ఊర్ధ్వగః సత్పదాచారః |
కనుక దీనిలో నిమగ్నుడు కాడు. పైపైన మెలగుతుంటాడు. తన సత్తయే తాను సంచరించే మార్గం. |
ప్రాణదః ప్రణవః పణః |
అనాహతరూపమైన ప్రాణంగా శరీరంలో ప్రవేశించింది. ఆహత రూపమైన ప్రణవనాదంగా లోపల వినిపిస్తున్నది. తదుపదేశంతో తన్ను తానే కీర్తిస్తున్నది. (పణ) |
ప్రమాణమ్ ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
ఒకటి ఉందని దాని ఉనికిని కొలిచేదీ - కొలిచే క్రియ కాధారమూ దానిని ధరించినదీ - దాని నెడబాయక నిత్యమూ దానితో సహా జీవనం సాగించేదీ - ఈ క్రియా కలాపమంతా ఆ ఈశ్వర చైతన్యమే. |
తత్త్వమ్ తత్త్వవిత్ ఏకాత్మా |
తత్త్వం పదార్థాలైన జీవేశ్వరులూ అదే - వాటి ఐక్యమూ అదే దాన్ని గ్రహించిన సాధకుడూ అదే. అదీ ఇదీ అనే తేడా లేని ఏకాత్మ స్వరూపమూ అదే. |
Page 64