నామం | అంతరార్థము |
---|---|
నియంతా నియమః అయమః |
ఆ పరమాత్మ వాటికి నియంత అయి నియమిస్తాడు. అప్పుడిక యముడనే ప్రశ్నేలేదు. యముడంటే కాలం. కాలప్రభావం లేదు మనమీద. |
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హః అర్హః |
నియమా నియమాలు రెండూ సమపాళ్ళలో ఉన్నాయా పరమాత్మలో నిర్దోషం హి సమం బ్రహ్మ, అలా ఉన్న సాధకుడికి అనుకూలుడు. త్యత్తంటే విలోమం దానితో కూడిన అనులోము డాయన | (సత్య) దానినే ఆలంబనగా చేసుకొన్న వారికి పరాయణుడు. అభి-ప్ర-అయ-ఆ సత్యానికభిముఖంగా వెళ్ళి అందుకోవలసినవాడు. అలాంటి అర్హతే తనకు ప్రియమనే వాడు. అలాటి భావనతోనే అర్హ పూజించవలసిన వాడు పూజిస్తే ఇష్టమైనదంతా ఇచ్చేవాడు. |
ప్రియకృత్ ప్రీతి వర్ధనః |
దానిమీద ప్రీతిని త్రుంచివేస్తూ తనమీద ప్రీతిని పెంచుతూ పోయేవాడు. |
విహాయసగ-తిర్జ్యోతిః | ఆకాశమంతా వ్యాపించిన జ్యోతి అది. దీనినంతా విహాయ-వదిలేసి (సగతి) గమనం చేసి అందుకోవలసిన ప్రకాశమది. |
సురుచిః హుతభుక్ విభుః |
సురుచి-చైతన్యరూపమైన జ్యోతి అది. సురుచి దాని రుచి బాగా తెలిసి (హుత) తనదనేది అంతా అందులో హోమం చేసి భుక్ అనుభవించవలసింది, అప్పుడది విభు-సర్వత్రా దర్శన మిస్తుంది. |
రవిః విరోచనః |
సాధకుడిలో ఉండే రసాన్ని (వాసనలను) పీల్చేస్తాడు మొదట విశేషమైన తన దీప్తిని ప్రసరింపజేస్తాడు పరమాత్మ. |
సూర్యః | సూర్య తన చైతన్యాన్నే వర్షిస్తాడతని మీద. |
Page 60