#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
సుమేధాః
మేధజః
ధన్యః
సత్యమేధాః
జ్ఞానమనేది మూర్తీభవించినవాడు. మేధ అంటే యజ్ఞం. జ్ఞాన యజ్ఞం. చేస్తే జన్మిస్తుంది. ఏమిటి ధనం. దానితో ధన్యులమైతే (సత్య) ఎప్పటికీ నిలిచే జ్ఞాన ధనమవుతుంది.
ధరాధరః తన్మూలంగా అన్నిటినీ ధరించే మాయాశక్తిని కూడా ధరించి ధరాధరుడు కాగలడు సాధకుడు.
తేజోవృషః
ద్యుతిధరః
తన తేజస్సునే జగద్రూపంగా వర్ణిస్తున్న చైతన్యమది. దానినే మరలా అధిష్ఠానరూపంగా ధరిస్తున్నది.
సర్వశస్త్ర
భృతాంవరః
శస్త్రమంటే విషయజ్ఞానం. అది ధరించినవారు జీవులు. వీరందరికీ వరణీయుడు ప్రార్థనీయుడు ఈశ్వరుడు. నరులక యనమైన వాడు నారాయణుడు.
ప్రగ్రహః సర్వశక్తులూ ప్రకర్షంగా పట్టుకొని (గ్రహ) ఉన్నవాడూ.
నిగ్రహః
వ్యగ్రః
ఎన్ని శక్తులున్నా బయటపెట్టనివాడు. పెట్టాలని సంకల్పిస్తే వివిధ రూపాలుగా బయటపెట్టేవాడూ ఆ పరమాత్మే.
నైకశృంగః
గదాగ్రజః
అనేక శాఖలుగా ప్రసరించేదా పరమాత్మ చైతన్యం. అంతగా ప్రసరిస్తున్నా (గద) వాక్కుల కందనంత (అగ్ర) ఎత్తులో ఉన్నది.
చతుర్మూర్తిః
చతుర్బాహుః
చతుర్వ్యూహః
చతుర్గతిః
విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయములనే నాలుగు మూర్తులూ సత్త్వ రజస్తమ శ్శుద్ధ సత్త్వాలనే నాలుగు బాహువులూ వాసుదేవ సంకర్షణాదులైన నాలుగు వ్యూహాలూ-కర్మభక్తి యోగ జ్ఞానాలనే నాలుగు గతులూ కలిగినదది.
చతురాత్మా
చతుర్భావః
విశ్వతైజస ప్రాజ్ఞ తురీయాలనే నాలుగాత్మలూ ధర్మ అర్థకామ మోక్షాలనే నాలుగు భావాలూ కూడా కలదది. ఋగాదులైన

Page 54

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు