నామం | అంతరార్థము |
---|---|
అనలః | (న+అలమ్ యస్య స అనలః) పరిమాణమింత ఉందని ఇంతవరకని చెప్పలేనిదది. |
దర్పహా దర్పదః దృప్తః |
ఆతేజః ప్రాణశక్తులు తనవని ఏ జీవుడైనా భావిస్తే వాడి దర్పాన్ని అణగగొడుతుంది. అసలా దర్పం వాడికది ఇస్తే వచ్చిందే. అది ఇచ్చిన దర్పమే గనుక ఈ దర్పించిన వాడు వీడు కాదు. అదే వాస్తవానికి. |
దుర్ధరః అపరాజితః |
చరాచర సామగ్రితో దర్పించినది గనుక దానినెవరూ ఎత్తలేరు. ధరించలేరు. మోయలేరు. అన్నింటినీ అదే మోస్తున్నది. అలా మోస్తున్నా (అపరాజిత) శ్రమ ఏ మాత్రమూ లేదు దానికి. |
విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తిః అమూర్తిమాన్ |
విశ్వమంతా దాని రూపమే. ఎంత విస్తారంగా నైనా ఉందా రూపం. కేవలం జడం కాదది. జ్ఞానంచేత ఎప్పుడూ దీప్తమైనది. జ్ఞాన మెప్పుడూ నిరాకారమే గనుక రూపమని అంటున్నా రూపంగాని రూపమది. |
అనేకమూర్తిః అవ్యక్తః శతమూర్తిః శతాననః |
రూపం కానిదే అనేక రూపాలుగా భాసిస్తున్నది. రూపం లేకుండా అది అవ్యక్తం. రూపమేర్పడితేనే అది వ్యక్తమై కనిపిస్తుంది. శతసహస్ర రూపాలతో కనిపిస్తుంది. శతసహస్ర ముఖాలతో (ఆనన) వ్యాపిస్తుంది. |
ఏకః నైకః |
ఏకమూ అదే, అనేకమూ అదే. స్వరూపంగా ఏకం, నామరూపాది విభూతిగా అనేకం. |
సవః | అదే తనకు తాను ప్రసవమయింది. |
కిమ్ యత్ తత్ |
ఎవడన్నా అదే, ఏదన్నా అదే. ఏదైతే అన్నా అదే. అదన్నా అదే. సర్వనామమది. సర్వనామాలూ దానివే. |
Page 52