నామం | అంతరార్థము |
---|---|
కేశిహా హరిః |
ప్రసరింపజేసింది. మరలా ఆ మూర్తిత్రయాన్ని సంహరించి సర్వహరమని ప్రసిద్ధి గాంచింది. |
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
(కామ) ఇచ్ఛాశక్తితో క్రీడిస్తాడాయన. దానిని పాలిస్తాడు అసలిచ్ఛా స్వరూపుడే అయి ఉన్నాడు. (క+అంతః) ఇచ్చనెప్పటి కప్పుడంత మొందిస్తుంటాడు. ఆ ఇచ్చతోనే మరలా అప్పుడప్పుడవతరి స్తుంటాడు (ఆగమ). జీవుడుగా - ఈశ్వరుడుగా. |
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరః అనంతః ధనంజయః |
ఇలాంటి స్వరూపమని నిర్దేశించలేము. సర్వమూ వ్యాపించి సర్వమూ తానే అయి కూచున్నది. వి+ఈర - చలనమే లేనిది. అంతులేనిది. దాని కంతం చెప్పాలంటే విజాతీయమైనది చూపగలగాలి. అది ఈ జ్ఞేయ ప్రపంచమే. ఈ ధనమంతా దానిదే. అదే. బ్రహ్మ అంటే తపస్సు-బ్రహ్మ అంటే వేదం. గొప్పతపస్సు (ఆలోచన) |
బ్రహ్మణ్యః బ్రహ్మకృత్ బ్రహ్మా |
చేసి వేదవిద్యను సృష్టించాడు. అది బ్రహ్మదేవుడికి బోధించాడు. |
బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
వేద స్వరూపుడే తాను. వేదమంటే జ్ఞానం. దానినే మానవలోకంలో విశేషంగా వర్థిల్ల జేస్తున్నాడు. |
బ్రహ్మవిద్ బ్రాహ్మణః బ్రహ్మీ |
దాని మర్మం తెలిసినవాడూ తానే. దానికి సంబంధించిన హక్కు హక్కుదారుడూ తానే. అది తనకంటే వేరుగా లేనివాడూ తానే. |
బ్రహ్మజ్ఞః బ్రాహ్మణప్రియః |
బ్రహ్మ అంటే యోగం. దాన్ని భేదించి పట్టుకొనే మార్గం తెలిసిన బ్రాహ్మణులంటే ఇష్టపడేవాడూ తానే. |
Page 49