నామం | అంతరార్థము |
---|---|
శ్రీనిధిః శ్రీవిభావనః |
చూపగలవాడు. విశేషంగా భావన చేసే కొద్దీ వాటిని మనకు ప్రసాదిస్తాడు. |
శ్రీధరః శ్రీకరః శ్రేయః |
సర్వశక్తులూ నిత్యమూ ధరించినవాడూ, మనలను ధరింపజేయ గలవాడూ అందుకోస మాశ్రయించవలసిన వాడూ ఆశ్రయిస్తే శ్రేయోదాయకుడైనవాడూ ఆ పరమాత్మ. |
శ్రీమాన్ లోకత్రయా శ్రయః |
శ్రీమంతుడూ ఆయనే. శ్రీ వివర్తమైన లోకత్రయానికీ అధిష్ఠాన మైన వాడూ మరలా ఆయనే. ఆరోపితమూ అధిష్ఠానమూ రెండూ పరమాత్మేనని భావం. |
స్వక్షః స్వంగః శతానందః నందీ |
సు+అక్ష-సకలేంద్రియ సౌష్ఠవమూ చైతన్య ప్రభావమే. సర్వావయవ (సు+అంగ) సౌష్ఠవమూ దాని ప్రభావమే. శతవిధాల మనసుకు కలిగే ఆనందమూ తత్ప్రభావమే. కాగా దానిననుభవించి ఆనందించే జీవతత్త్వమూ అదే. |
జ్యోతిర్గణేశ్వరః | ప్రకాశశీలమైన ఇంద్రియ వర్గానికీ ఆధిదైవికమైన జ్యోతిర్గణానికీ కూడా ప్రకాశకుడైనవాడు పరమాత్మ. |
విజితాత్మా విధేయాత్మా |
దేనిచేతా పరాజితం కాకుండా అన్నిటినీ తనకు విధేయం చేసుకొని పాలించే సచ్చిత్స్వరూపుడాయన. |
సత్మీర్తి ఛిన్న సంశయః |
సద్రూపమైన ప్రకాశమది. అందుకే దాని నాశ్రయిస్తే ఎలాంటి సంశయాలైనా విచ్ఛిన్నం కావలసిందే జీవులకు. |
ఉదీర్ణః సర్వతశ్చక్షుః అనీశః శాశ్వతస్థిరః |
సంశయస్థానమైన సంసారాన్ని మించి (ఉత్-ఈర్ణ) పైకి లేచిన దాతత్త్వం. అంటకుండా అన్నివైపులా చూస్తున్నదీ సంసారాన్ని, దాన్ని చూచే సామర్థ్యం దేనికీ లేదు. అది ఎప్పటికీ నిలిచి ఉండేదా చూపు. |
Page 47