#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
గోహితః
గోపతిః
గోప్తా
పార్థివమైన తత్త్వంలో నిహితుడయి ఉన్నది తానే. దానికి మరలా పాలకుడయినదీ తానే. అయినా బయటపడకుండా తన అసలైన రూపాన్ని గోపనం చేసుకొంటూ ఉంటాడు.
వృషభాక్షః
వృష ప్రియః
ధర్మదృష్టితో మానవులను చూస్తూ వారు ధర్మం చేస్తుంటే ప్రీతి పొందుతుంటాడు.
అనివర్తీ
నివృత్తాత్మా
ధర్మానుష్ఠాన ఫలాన్ని అందజేయటంలో వెనక్కు తగ్గడు. తన స్వరూపం చూపకుండా ఎప్పుడూ వెనక్కు తిరిగే ఉంటాడు.
సంక్షేప్తా
క్షేమకృత్
శివః
ధర్మసాధకులు గాక మోక్షసాధకులనైతే వారి జీవభావాన్ని తనలో సంక్షిప్తం చేసి బ్రహ్మ భావాన్ని వారికి తొలగకుండా కాపాడుతూ (క్షేమకృత్) నిత్యశివమైన సాయుజ్యసుఖాన్ని వారికి ప్రసాదిస్తాడు.
శ్రీవత్సవక్షాః
శ్రీవాసః
శ్రీపతిః
శ్రీమతాం వరః
అలాంటి శివమైన శ్రీ (శక్తి) నిరంతరమూ తన (వక్ష) హృదయంలో నిలుపుకొన్నవాడు, తన మాయాశక్తికి తానే నివాసమైనవాడు. దాని కధిపతి తానే. మిగతా శక్తిమంతులని వరః చెప్పబడే దేవతలందరిలో (వర) శ్రేష్ఠుడాయన. వారందరికీ (వర) శ్రేష్ఠుడాయన. వారందరికీ (వర) వరణీయుడు కూడా.
శ్రీదః
శ్రీశః
శ్రీనివాసః
ఏ సాధకుడికేది కావలిస్తే అది ఇస్తాడు. దానికి సమర్థుడు. సర్వశక్తులకూ నివాసం నిలయమైనవాడు. వాటిని మనలో (నిధి) నింపగలవాడు. వివిధ రూపాలలో శక్తినావిష్కరించి

Page 46

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు