#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
అనయః ప్రయత్నమే ఆయన అనుగ్రహం. అప్రయత్నమే ఆగ్రహం.
వీరః
శక్తిమతాంశ్రేష్ఠః
ధర్మః
ధర్మవిదుత్తమః
అనుగ్రహిస్తే వి+ఈర. విశేషంగా ఈరణ చేయగలడు. లేకుంటే విరుద్ధంగా త్రోసివేయగలడు. శక్తిమంతులకంటే శక్తిమంతు డందులో ధర్మమంటే సాధన. సాధనా-సాధన రహస్యం తెలిసినవాడూ, ఉత్తమమైన సిద్ధి మూడింటి స్వరూపమాయన.
వైకుంఠః
పురుషః
వికుంఠః-ఏ మాత్రమూ కుంఠితం కాని దా స్థానం. అది పూర్ణం. పురుష అంటే పూర్ణమైనదనే అర్థం.
ప్రాణః
ప్రాణదః
ప్రణవః
పృథుః
ప్రాణ రూపం కూడా అదే. అది చలిస్తేనే ప్రాణమయింది. మనకీ ప్రాణన శక్తిని ప్రసాదించింది అదే. ప్రణవనాద రూపంగా ఈ ఉపాధిలోకి దిగి వచ్చింది. ఘనీభవించి కళగాకూడా మారింది. అదే ఈ పృథివ్యాధికం.
హిరణ్యగర్భః
శత్రుఘ్నః
అయినా కొఱతలేదు. హిరణ్య-చిత్ప్రకాశ గర్భితమైనదది. దాన్ని పట్టుకొంటే చాలు. ఉపాధులనే శత్రువులను సంహరిస్తుంది.
వ్యాప్తః
వాయుః
అథోక్షజః
దీని ఖాళీకూడా అదే వ్యాపించి ఉందసలు. సాధన చేస్తే మరలా వాయు - వ్యాపించినట్టు కనిపిస్తుంది. అప్పుడింద్రియ జ్ఞాన (అక్షజ) మడుగంటి అతీంద్రియ జ్ఞానమలవడక తప్పదు.
ఋతుః ఋ అంటే దర్శనం. తద్బలంతో ద్రష్ట అవుతాడు సాధకుడు.
సుదర్శనః
కాలః
సుదర్శనం. సమీచీనమైన దర్శనమది. కలయతీతి కాలః సమస్త సృష్టినీ కలనం చేసుకొంటాడు. అంటే తన స్వరూపంగా మార్చుకోగలడు.
పరమేష్ఠీ
పరిగ్రహః
పరమమైన స్థానంలో ఉండిపోతాడు. అలా ఉండి చరాచర జగత్తునంతా అన్ని వైపులా (పరి) తన చైతన్యక్షేత్రంలోనే పట్టుకొని (గ్రహ) ఉంటాడు.

Page 35

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు