#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
కరణమ్
కారణమ్
కర్తా
వికర్తా
ఒక కార్యానికి తోడ్పడే కరణమూ దాని కుపాదానమైన కారణమూ దానికి నిమిత్తమైన కర్తా - దాన్ని ఎప్పటికప్పుడు మార్పు చెందించే వికర్తా అంతా అదే. మరేదీ కాదు.
గహనః
గుహః
అంతా అదే అయ్యేసరికి దాన్ని అర్థం చేసుకోవటం గహనమవు తున్నది. అంత గంభీరమైనదది (గుహ)
వ్యవసాయః
వ్యవస్థానః
సంస్థానః
అందుకోసం వ్యవసాయ-నిశ్చయాత్మకమైన బుద్ధి కావాలి. అది వ్యవస్థాన గట్టిగా నిలవాలి. సంస్థాన - చెదరకుండా ఒక్కచోట పుంజీకృతం కావాలి. అన్నిటినీ కలుపుకోవాలి.
స్థానదః
ధ్రువః
ఆసించిన స్థానం లేదా ఫలితాన్ని అందివ్వాలి. అది మరలా చలించకుండా ధ్రువమయి ఉండాలి.
పరార్ధిః
పరమస్పష్టః
అంత పుష్కలమైనదది. పరమ్+అస్పష్టమ్ అయినా అస్పష్టమే దాని స్వరూపం. ఆత్మరూపంగా భావిస్తే ఎంతో స్పష్టం. పరమ స్పష్టం.
తుష్టః
పుష్టః
శుభేక్షణః
స్పష్టమెప్పుడయిందో తుష్టి పుష్టి కూడా చేకూరుతుంది. అలాంటి శుభాన్ని మానవుడికందించే చూపుగలదా పరమాత్మ చైతన్యం.
రామః
విరామః
విరతః
జీవేశ్వర రూపంగా ఈ సంసారంలో రమించేది అదే, దీని నుంచి విరమించేది అదే. అసలు ఎప్పుడూ విరమించి ఉన్నదీ అదే.
మార్గః
నేయః
నయః
అలాంటి తత్త్వాన్ని చేర్చే మార్గమూ అదే. ఆ మార్గంలో కొనిపోబడే సాధకుడూ అదే, కొనిపోవటమదే, సాధకుడు కాకుంటే అలాంటి లౌకికుణ్ణి కొనిపోవనిదీ అదే, మన

Page 34

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు