నామం | అంతరార్థము |
---|---|
స్థవిష్ఠః స్థవిరః ధ్రువః |
జీవులమైన మనకూ ఉంది ఆలోచనా - క్రియా. ఇది స్థవిరమే. దృఢమైనదే ఈ శక్తి. కాని అది స్థవిష్ఠమాయన శక్తి. మనకున్నది అధ్రువమైతే ఆయనది ధ్రువం. |
అగ్రాహ్యః | అధ్రువం గనుకనే మన బుద్ధి దాన్ని గ్రహించలేదు. అది అగ్రాహ్యం, మనస్సుకూ వచస్సుకూ కూడా అతీతం. |
శాశ్వతః | మనం గ్రహించకపోయినా అది ఎప్పుడూ ఉంది. శాశ్వతమే, అయినా కనపడదు. |
కృష్ణః | ఉన్నప్పుడు కనపడటానికేమి ? కృష్ణః ఆకాశంలాగా నల్లనిది. ఆకాశం మన దృష్టి కెలాగో అలాగే మనోదృష్టి కడ్డుతగిలి మనలను ముందుకు సాగనీయదు. |
లోహితాక్షః | అయితే మనం చూడకపోయినా మన మనసు మొదలుకొని అన్నింటినీ చూస్తూ ఉన్నదది. రోహితమంటే ఎరుపనీ పెరిగి పోయినదని కూడా అర్థమే. ఎరుపు రజోగుణం. రజస్సు చలనాత్మకం. అంతటా ప్రసరిస్తూ పెద్దదైన దృష్టి అది. అన్నింటినీ కనిపెట్టటంలో ఆశ్చర్యమేముంది. |
ప్రతర్దనః ప్రభూతః |
తర్దనమంటే నశింపజేయటం. భూతమంటే కల్పించటం, సమస్తాన్నీ నశింపజేస్తున్నదీ-మరలా కల్పిస్తున్నదీ కూడా అదే. రెండు శక్తులూ ఉన్నాయి దానికి. ఘటనా ఘటన సమర్థం. |
Page 13