నామం | అంతరార్థము |
---|---|
త్రికకుబ్ధామ | కకుప్పంటే దిక్కు, మూడు దిక్కులా ప్రసరించిన తేజస్సది. ఏమిటా మూడు. అవస్థాత్రయమైనా కావచ్చు. పురత్రయమైనా కావచ్చు, అసలు అన్నింటికీ మూలమైన గుణత్రయమే కావచ్చు. మూడింటి లోనూ నిండి ఉన్నదా చైతన్య జ్యోతే. ధామమంటే జ్యోతిస్సే కాదు. నిలయం కూడా. గుణత్రయానికి నిలయం కూడా అదేనని అర్థం. |
పవిత్రం మంగళం పరం |
గుణాతీతం గను కనూ ! తేజోరూపం గను కనూ ! దానినేదీ అంటదు. అది ఎప్పుడూ పవిత్రమే, పరిశుద్ధమే. నహిజ్ఞానేన సదృశం - పవిత్రమిహ విద్యతే. తాను పవిత్రం కావటమే కాదు. తన ప్రభావంచేత ఈ జీవుల బుద్ధులను కూడా పవిత్రం చేయగలదు. అదే మనకు మంగళం శ్రేయస్సు. పరమన్నందువల్ల శ్రేయస్సే కాదు, నిశ్రేయసం - మోక్షమే. |
ఈశానః ప్రాణదః ప్రాణః |
ఈశానమది. అన్నిటికీ సమర్థమైనది. మానవుడికీ ప్రాణశక్తి నిచ్చింది అదే. అసలు ప్రాణమనేది కూడా అదే. యాప్రజ్ఞా సప్రాణః అన్నట్లు జ్ఞానమే ప్రాణం. కదలకుంటే జ్ఞానం, కదిలితే ప్రాణం. |
జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
ప్రాణరూపంగా మొట్టమొదట మన ఈ ఉపాధిలో ప్రవేశించింది అదే. అందుకే అది జ్యేష్ఠం. మిగతా కరణవర్గంకన్నా మొదటిది. జ్యేష్ఠమే కాక శ్రేష్ఠం కూడా. జ్ఞానంతోనే ఓతప్రోతమయి ఉంది కాబట్టి జ్యేష్ఠం. జ్ఞానంలాగా నిరాకారం గనుక శ్రేష్ఠం. అంతేకాక దాని మూలంగానే ప్రజాసృష్టి ఏర్పడుతూ అదే దీన్ని కాపాడుతున్నది గనుక ప్రజాపతి కూడా ప్రాణం. |
హిరణ్యగర్భః భూగర్భః |
హిరణ్యమంటే బంగారంలాగా దీప్తిమంతమైన చైతన్యం. దాన్ని తనలో ఇముడ్చుకొన్నదీ ప్రాణం. అందుకే జీవాత్మ అని పేరు శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము వచ్చింది దీనికి. అయితే హిరణ్యగర్భమే గాక భూగర్భం కూడా అయిందిది. చైతన్యతత్త్వమే గాక అచేతనమైన పృథివీతత్త్వం కూడా చేరి ఉన్నదిందులో. |
Page 12