నామం | అంతరార్థము |
---|---|
భూతాదిః నిధి రవ్యయః |
అచలం గనుకనే భూతసృష్టి కంతటికీ ఆది అయిందది, ఆదేకాదు, అంతంకూడా 'నిధీయంతే అస్మిన్ భూతానీతి నిధిః సమస్త భూతాలూ దానిలోనే లీనమయి ఉన్నాయి. అవ్యయం, తరగతని నిధి అది. |
సంభవః భావనః భర్తా |
కనుకనే దాని నుంచే మరలా ఈ చరాచర భూతాలు సంభవిస్తున్నాయి అదే వీటి నిలా నిలుపుతున్నది. మరలా వీటిని భరిస్తున్నది. అంటే తనలో ఇముడ్చుకొంటున్నదీ అదే. |
ప్రభవః ప్రభుః ఈశ్వరః |
ప్రభుత్వమంటే సామర్థ్యం. అలా ఈ భూత జాతాన్నంతా సృష్టించే (ప్రభవ) పోషించే (ప్రభు) తనలోనే లయం చేసుకొనే (ఈశ్వర) శక్తి ఉంది దానికి. |
స్వయంభూః శంభుః |
దానికి మాత్రమే సృష్టి స్థితి లయాలు మూడూలేవు. అది తన పాటికి తాను స్వయంగానే ఉంటుంది. శమ్- సుఖంగా ఉంటుంది. |
ఆదిత్యః పుష్కరాక్షః మహాస్వనః |
ఆది+త్య = ఆది నుంచీ అలాగే ఉంటున్నది. పుష్కలమైన దృష్టి లేదా జ్ఞానముంది దానికి. పుష్కరమంటే ఆకాశమని కూడా అర్థం. ఆకాశంలాగా అనంతమైనదా జ్ఞానం. అలాగే అనంతమైన స్వనం లేదా శబ్దరూపమైన ప్రాణం కూడా ఉంది. అంటే జ్ఞాన క్రియాశక్తులు రెండూ పరిపూర్ణంగా ఉన్న తత్త్వమది. |
అనాది నిధనః ధాతా |
జ్ఞాన ప్రాణ స్వరూపమే గనుక దాని కొకప్పుడు జననమూలేదు. మరొకప్పుడు మరణమూ లేదు. అనాది నిధనమది. అవి రెండూ అది తనలోనే ధరించి ఉన్నది. ధాత అంటే ధరించి ఉందనే అర్థం. తాను ధరించినవి తన్నెలా మించి పోగలవు. |
Page 10