#


Index

భాగవతము - సందేశసారము

నోచుకోగలం. అది ఎప్పుడో కరువయిపోయింది. పోతే ఇహానికి పరానికీ రెంటికీ దూరమయిన ఈ కలిలో ఇకమనుగడ ఏముంది మానవుడికి. కలియుగాంతమే ఇది. ఇది భాగవతమే గాదు ఆధునికులైన త్యాగరాజాది మహాపురుషులు కూడా తమ రచనలలో స్పష్టంగా చాటిచెబుతున్నారు. పెద్దలందరికీ అలాగే మనసుకు తోస్తున్నది. కనుక యుగాంతం తప్పదు. ఇది అంతమైతే గాని మరలా కృతయుగ ధర్మం ప్రవర్తించదు. దాని చిహ్నాలు కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి మనకు. ప్రపంచ వ్యవహారాలిప్పుడేవి చూచినా బాగా భ్రష్టమైన స్థితికి వచ్చింది. బ్రతుకు నానాటికీ బరువయి పోయింది. మానవులకు ఎక్కడ చూచినా బాధలే. భీతాహాలే. దీనితో ఏ గ్రంథాలూ చదవకుండానే ఏ గురూపదేశం లేకుండానే విరక్తి కలుగుతున్నది మానవులకు. జీవితమంటే రోతపుడుతున్నది. జీవిత గమ్యమేమో, దీనికంతటికీ అతీతమైన శక్తి ఏదైనా ఉందేమో, లేకుంటే ఎందుకిలా జరుగుతోంది, దానినెలా పట్టుకోటమా అని మరలా మరలా తీవ్రమైన అన్వేషణ ప్రారంభమయింది. నిజమైన శ్రద్ధాభక్తులతోనే సాగిస్తున్నారన్వేషణ. అన్ని దేశాలలోనూ సాగుతున్నదిది.

  ఇలాటి అన్వేషణాపరులే శౌనకాదులు. శునక గుణమైన శ్రద్ధ ముఖ్యంగా ఉన్నవారు. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" అది ఒకటి ఉంటే చాలు. బాగుపడతాము. దానివల్లనే జ్ఞానం, విజ్ఞానం రెండూ లభిస్తాయి. వీరు కొందరైనా ఉండబట్టే ఈ ప్రపంచం కేవలం నైమిశారణ్యమయిపోక విష్ణుక్షేత్రమనిపించుకొంటున్నది. మరలా సూతునిలాంటి ఉగ్రశ్రవులైన మహాత్ములవల్ల జీవిత సత్యమేదో దాన్ని శ్రవణం చేస్తూ మానవులు భాగవత ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అలసులూ, మందబుద్ధులూ అయిన ఈ కలికాల మానవులలో సౌఖ్యం శాంతి పూర్తిగా లుప్తమయిందని తెలిసి వీరు పరమ సత్యప్రాప్తి కోసం పాటుపడుతున్నారు. శతవర్ష సమ్మితమైన జీవితమంతా శతవార్షికమైన ఒక జ్ఞానయజ్ఞంగా భావించి అందులోనే దీక్షితులయి ఉన్నారు. పరీక్షిత్తు ప్రాయోపవేశ దీక్ష కూడా ఇదే. తక్షకుడి లాటి కాలమెలాగూ కాటు వేస్తుంది రేపు మనలనందరినీ. ఎంత మంచి వారమైనా ఎంత జ్ఞానులమైనా పోవలసిందే. తప్పదు. ఎందుకంటే కలియుగాంత మవుతుందని గదా చెబుతున్నది భాగవతం. ఇంత ధర్మ విప్లవ మేర్పడిన తరువాత కాక తప్పదు. ఇప్పుడో అప్పుడో అన్నట్టున్నది

Page 403

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు