#


Index

ప్రస్థానత్రయ సారము

చైతన్యమే నేనని -ఇలా ప్రతిలోమంగా అనులోమంగా తన స్వరూపాన్ని పట్టుకోగలగాలి. అప్పుడే మద్భావం సోధిగచ్ఛతి. నా పూర్ణ స్వరూపం గుర్తించి జన్మమృత్యు జరా దుఃఖైర్విముక్తః జనన మరణ నమస్య నుంచి బయటపడతారని హామీ ఇస్తున్నది గీత.

పురుషోత్తమాధ్యాయం

  ఈ సాధన మార్గమే పురుషోత్తమాధ్యాయం కూడా ఇంకా చమత్కారంగా ఒక అశ్వత్థ వృక్షం మీద నెపం పెట్టి వర్ణిస్తున్నది. అశ్వత్థ మంటే రావిచెట్టు. చలదళ మని పేరు దానికి -ఎప్పుడూ చలించే స్వభావమా చెట్టుకు. అలాగే ఈ సంసార వృక్షం కూడా చలనాత్మకమే. ఏదీ నిలకడగా ఉండదిక్కడ. క్షరమిది. నశించేదని అర్థం. ఇది గాక అక్షర మొకటున్నది. అది దీనికి మూలమైన మాయా శక్తి. అది పరమాత్మ నాశ్రయించిన ఆయన శక్తి కాబట్టి క్షరం కాదక్షరం. పోతే ఈ క్షరాక్షరాలు రెంటికీ విలక్షణమైన దొక్కటే ఉంది తత్త్వం. అది ఆ పరమాత్మ చైతన్యమే. ఇవి రెండూ పురుషులైతే అది పురుషోత్తమ.

  పురుషుడైనా ఇవి ఆయనలాగా పూర్ణ స్వరూపం కావు. అపూర్ణమే. పూర్ణంలాగా భాసిస్తున్నాయి. సాపేక్ష మివి Rela-tive. నిరపేక్షం కావు Absolute నిరపేక్షమది ఒక్కటే. కనుక

Page 59

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు