#


Index

ప్రస్థానత్రయ సారము

జయించగలడు మానవుడు. నిర్మమో నిరహంకారః - కామం పోవాలంటే అహం మమలు లేకుండా పోవాలి. అప్పుడే సుఖదుఃఖేసమే - సుఖదుఃఖాది ద్వంద్వాలు సమంగా భాసిస్తాయి సాధకుడికి. ఈ స్థితికే బ్రాహ్మీ స్థితి అని పేరు. ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠం. నదుల వెంటబడి పోదు సముద్రం. అది కదలకుండా ఒకచోట స్థిరంగా ఉంటే నదులన్నీ వచ్చి అందులో చేరిపోతాయి. అలాగే నిష్కామంగా నీవుంటే నీ దగ్గరికే వస్తాయన్నీ. ఇదీ సాంఖ్యం చెప్పే మాట.

కర్మయోగం

  ఏ కామమూ లేకుండా ఊరక కూచుంటే దినచర్య ఎలా జరగాలి. దినచర్య అంటే కర్మే గదా. కామం లేకుండా కర్మ ఎలా చేయగలం. నహికశ్చిత్ క్షణమపి ఒక్క క్షణం కూడా ఊరక కూచోలేడెవడూ నిద్రలో తప్ప. అప్పుడు కామం లేదు కర్మ లేదు. కాని దాని వాసన లుంటాయి. అవి మరలా జాగ్రత్తులో బయటపడతాయి. ఇక ఎప్పుడీ కర్మ బంధం నుంచి విముక్తి. కర్మ అంటే చేయటమూ నిష్కర్మ అంటే మానటమూ కాదు. ఏ పని చేసినా అది మానసికమే గాదు. వాచికమే గాదు. కాయికమే గాదు యజ్ఞార్ధమని చేస్తూ పోవాలి. యజ్ఞమంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర చైతన్యమే నా చేత

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు