#


Index

ప్రస్థానత్రయ సారము

ఈ పని చేయిస్తున్నదని భావించాలి. అప్పుడు నేననే అహంకారం పోతుంది. ముక్తసంగుడయి చేయాలి కూడా. అంటే ఫలితం నాకు అనుకూలించాలనే కామం కూడా పనికి రాదు. అదీ ఆ ఈశ్వరుడికే అప్పజెప్పాలి. అప్పుడు మమకారం కూడా తొలగిపోతుంది. అహం మమలు రెండూ పోతే కామం లేదు. కర్మా లేదు. అవి ఉన్నా జీవుడివి కావు. జీవుడీశ్వరుడి కర్పించాడు కాబట్టి ఈశ్వరుడివే. జీవకర్మ ఈశ్వరుడి కర్మే. జీవుడి కామం ఈశ్వర కామమే. ఇదీ కర్మయోగ సూత్రం.

జ్ఞానయోగం

  ఇలా ఈశ్వర భావన చేస్తూ దాని వెలుగులోనే జీవయాత్ర సాగిస్తూ పోతే కర్మ జ్ఞానంగా మారుతుంది. కర్మలో అకర్మా అకర్మలో కర్మ. రెండూ ఏకమవుతాయి. రెంటికీ భేదం లేదు. ఒకటి దృష్టి మరొకటి దాని ప్రసరణ. సముద్ర జలమూ దాని చలనమూ ఒకటిగాదా. అలాగే ఇదీ. అప్పుడు కర్త అయినా కర్త కాడు మానవుడు. జ్ఞానమనే అగ్ని కామకర్మలు రెంటినీ కాల్చి వేస్తుంది. అప్పుడు ఒక కర్మ చేస్తున్నా చేయనివాడే. అయితే ఈ నిబ్బరం మన కలవడాలంటే ఎక్కువ పనులు పెట్టుకోరాదు. శరీరం నిలవటాని కెంతో అంతే

Page 41

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు