#


Index

  <ఇది ఒక అనన్య సామాన్యమైన ప్రతిభ. భాష్యకారుల కొక్కరికే చూడగలమిది. మరి ఎక్కడా కనిపించదు. ప్రస్తుతమీ నిర్వాణదశకాన్ని చూస్తేనే మనకు విశదమవుతుందీ విషయం. ఇదికూడా భజగోవిందాదుల లాగా మందాధికారుల కోసం వ్రాసిన ఒక స్తోత్రగ్రంథమే. చూడటానికి చాలా చిన్నదైనా మర్రి విత్తనంలో మహావృక్షంలాగా ఇందులో అద్వైత జ్ఞానరత్నాలన్నీ గుప్తమయి ఉన్నాయి. భావన చేసేకొద్దీ అవి బయటపడుతూ వస్తాయి. కనుకనే మధుసూదన సరస్వతి అనే మహావిద్వాంసుడు దీనినెంతగానో మధించి సిద్ధాంత బిందువనే పేరుతో ఒక విపులమైన వ్యాఖ్య వ్రాసిపోయాడు. కాని బాగా మననం చేస్తే ఇంకా దీన్ని సుళువుగానూ, సమగ్రంగానూ బోధించ వచ్చునన్న అభిప్రాయం నాకేర్పడింది. ఆ విశ్వాసంతోనే యథాశక్తిగా నేనీదశకాన్ని భగవత్పాదుల కటాక్ష బలంతో మథించి తత్సారాన్ని జిజ్ఞాసులోకాని కందించదలచాను. దీనిమూలంగా జిజ్ఞానువులైన పెద్దలూ, పిన్నలూ అద్వైత వేదాంతాన్నంతటినీ ఆకళించుకొని అనుభవానికి తెచ్చుకోగలిగితే అంతకన్నా కావలసింది లేదు. వారి జీవితమూ నా జీవితమూ కూడా ధన్యమేనని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఇట్లు

యల్లంరాజు శ్రీనివాసరావు

Page 4