#


Index

  ఏమిటీ సంకేతంలో అంతరార్థం కుడిచేతి బొటనవ్రేలితో చూపుడువ్రేలు కలిపి పట్టుకొంటే అది చిన్ముద్ర. ఏమిటీ సంకేతంలో అంతరార్థం. చూపుడువ్రేలు జీవుడు. వీడు త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో షరీకయి ఇదే తానని భావిస్తున్నాడు. త్రిగుణాలకు సంకేతాలే మిగతా మూడు వ్రేళ్లు. వాటితో కలిసి అలా భావించి నంత వరకూ వీడి కసలైన ఆత్మ తలంపుకు రాదు. రావాలంటే త్రిగుణాలకు దూరంగా వైదొలగి పరమాత్మను పట్టుకోవాలి. ఆ పరమాత్మకు సంకేతమే బొటనవ్రేలు. దానిని చూపుడు వ్రేలు గ్రహించట మంటే అసలైన ఆత్మను జీవుడు పట్టుకోవటమే. పట్టుకొంటే అనాత్మ సంపర్కం తొలగింది కాబట్టి అప్పుడంతా ఒకే ఒక అఖండాత్మగా ప్రకటితమై స్వానుభవానికి వస్తుంది సాధకుడికి. ఇదీ ఇందులో దాగి ఉన్న ఆంతర్యం.

8

  స్వానుభవానికి మన ఆత్మ స్వరూపం మనకు వస్తుందన్నారు. బాగానే ఉంది కాని అలాటి పూర్ణానుభవం కలగట మనేది సామాన్యమైన విషయం కాదు. అంత సామాన్యమైతే ఇంతగా శ్రవణం చేస్తున్న మనకది ఎప్పుడో లభించి ఉండేది. ఎంత వింటున్నా దుర్లభంగా తోస్తున్నదంటే ఏమిటి కారణం. ఒక్కటే కారణం అదే మాయ.

Page 72