#


Index

  ఇది శరీరమని ఇది ప్రాణమని - ఇది మనస్సని - గమనించగలుగు తున్నాము. ఆ గమనించే పదార్థమే చైతన్యం. గమనించే దెప్పుడూ గమనించబడే వాటికన్నా విలక్షణంగా Distinct ఉండాలి. గమనించబడే దేమిటిక్కడ. శరీరం మొదలు కొని మనసు వరకూ అన్నీ గమనించబడేవే.

  అదేమిటి! శరీరేంద్రియ ప్రాణాలంటే సరేగాని మనస్సు గమనించబడేదేలా అవుతుంది. అదే గదా అన్నిటినీ గమనిస్తూ ఉన్నది మనలో అని సందేహించవచ్చు. మనస్సంటే ఏమిటని అనుకొంటున్నారు. మీరు. ఆలోచనల పరంపరకే మనస్సని పేరు ఆలోచన అంటే ఏమిటి ఒక వృత్తి లేదా చలనం Function or Motion ఈ చలనమెలా ఏర్పడింది. దీనికి పూర్వమేముంది మనలో కేవలజ్ఞానమే ఉంది. అది ఏ ఆలోచనా చేయనంత వరకూ కేవల జ్ఞానమే Pure Consciousness అందులో కదలిక లేదు. అచలమది. అది ఒక వెలుగు తెర లాంటిది. ఆ తెరమీద ఏయే బొమ్మలు పడుతుంటే ఆ వెలుతురూ బొమ్మలూ రెండూ కలిసి ఆలోచన వృత్తి అని పిలువబడుతున్నాయి. అదే మనస్సు.

  బొమ్మలనేవి భౌతికమైన నామ రూపాలే. అవి వేరయిపోతే ఆ తెర తెరగానే నిలిచిపోతుంది. అప్పుడు దానికి మనసనే పేరే లేదు. అయితే ఏమిటది. దానినే చైతన్యమూ లేక ఆత్మ అంటున్నారు వేదాంతులు. కాబట్టి మనసు కంటే విలక్షణమైన దొకటున్నది తత్త్వం. అది ప్రకాశ రూపమైన శుద్ధచైతన్యం. దాని ప్రకాశమే మనసుకు సరఫరా అయి జడమైన మనసు మనకు చేతనం లాగా భాసిస్తున్నది.

Page 41