#


Index

  స్వరూపంలో ఉండాలంటే సర్వమూ ఆత్మే ననే సర్వాత్మ భావం కలగాలి. అప్పుడది వ్యాధి కాదు సమాధి. మరి ఈ సమాధి ఎలా సిద్ధిస్తుంది. దక్షిణ దక్షిణమైన అమూర్తిని నమ్ముకోవాలి. ఏమిటా అమూర్తి. సర్వవ్యాపకమై సర్వానన్యమైన చైతన్యం. అది మన స్వరూపమే. దానికి మన మెన్ని జన్మల నుంచో దూరమై పోయాము. దానికి దూరమై పోయేసరికి దీనికి దగ్గర పడ్డాము. మరలా దీని నుంచి దూరమై దానికి దగ్గర చేరాలి. చేరాలంటే ఆ దక్షిణామూర్తి ఆలయంలో ప్రవేశించాలి. అంటే మన సర్వాత్మ భావంలోనని అర్థం. ప్రవేశించి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అంటే మన చుట్టేనని అర్థం. అలా ప్రదక్షిణం చేస్తూ అక్కడే తిష్ట వేసుకొని కూచోవాలి అంటే ఆ భావంలోనే నిష్ఠ కలిగి ఉండాలని అర్థం అదే నివేశమంటే మొదటిది ప్రవేశమైతే కడపటిది నివేశం. ప్రవేశం నివేశంగా మారే వరకూ మన చుట్టూ మనం ప్రదక్షిణం సాగించ వలసిందే తప్పదు.

ఆత్మాన మేక మపహాయ నకించి దన్య దస్తీతి పూర్వ మపరోక్షతయా విదిత్వా భూయ స్తదేవ రచనా మృత వర్షపాతై రావిశ్చకార భువి యస్త మహం నతోస్మి

Page 108