#


Index

  కాబట్టి ఇదే చర్మం కృత్తి. ఈ కృత్తిని స్వయంగా కప్పుకొన్నదా ఈశ్వరచైతన్యం తెలిసి కప్పుకొన్నది కనుక ఆయన శక్తికి మోసం లేదు. ఈశః దాని కాయన ఎప్పుడూ ఈశుడే అధీశుడే.

  పోతే అలాటి అధీశ్వరత్వానికి నోచుకోని వాళ్ళం మనమే. ఆయన శక్తికధీశుడైతే మనం దాని కధీనులం. కారణం ఆయన తెలిసి కప్పుకొంటే మనం దాన్ని తెలియక కప్పుకొన్నాము కప్పుకొన్నది మరలా విప్పుకొనే వరకూ అది మనకు గళ గ్రహమే. అదే ఈ సంసార బంధం ఈ బంధం నుంచి విముక్తులం కావాలంటే సతత మవతునః నిత్యముక్తుడైన ఆ ఈశ్వరుడే మనలను కాపాడాలి. కాపాడాలని చెప్పి ఆయనను నిత్యమూ భజించాలి. భావించాలి మనం. ఆయనఅంటే ఎవరాయన. దక్షిణామూర్తిః దక్షిణమైన మూర్తి. మూర్తి కాదది అమూర్తి అంటే నిరాకార చైతన్యమే అది దక్షిణం వామం కాదు. వామమంటే వక్రమైనది. వక్రమైనది సంసార చక్రం దీనికి కారణం అనాదికాల ప్రవృత్తమైన మన అవిద్యే. అదే అసలైన వామ బిందునాద కళా రూపంగా పరణిమిస్తూ మనలనీ సంసార కూపంలో పడదోస్తున్నదదే. కాబట్టి దక్షిణ కాదది వామే.

  ఈ వామను నమ్ముకొన్నంత వరకు అది వ్యాధి మన పాలిటికి సమాధి కాదు. వ్యాధి అంటే మనమెక్కడ ఉండాలో అక్కడ లేకపోవటం. మనమంతా ఇప్పుడు మన స్వరూపమైన చైతన్యంలో లేము. పరరూపమైన సంసారంలో ఉన్నాము.

Page 107