నామం | అంతరార్థము |
---|---|
ఆత్మయోనిః స్వయంజాతః వైఖానః సామగాయనః |
అంచేత ఏది ఎక్కడ జన్మించిందని చెప్పినా దానివల్ల అదే జన్మిస్తున్నది. అంతకన్నా వేరుగా జన్యమూ లేదు. జనకమూ లేదు. విశేషంగా తన్ను తాను ఖననం చేసుకొని జగత్తును సృష్టించింది. తనతో సమాన లక్షణుడైన జీవుడి రూపం ధరించి అందులో ప్రవేశించింది. సామగ+అయన. |
దేవకీనందనః | దీవ్యతి-క్రీడతీతి దేవీ - స్వార్థేకప్-దేవకీ-యోగ మాయ అని అర్థం. దానితో నిత్యమూ (నందన) ఆనందిస్తుంటాడు. |
స్రష్టా క్షితీశః పాపనాశనః |
తదానందఫలంగానే సృష్టిస్తాడు. క్షీతి, దీని స్థితికి కర్త అయ్యాడు. అవిద్యాదులైన త్రివిధ పాపాలను మరలా లయం చేస్తాడు. |
శంఖభృత్ నందకీ చక్రీ శార్బధన్వా గదాధరః |
పాంచజన్యమనే శంఖమూ, నందకమనే ఖడ్గమూ సుదర్శన మనే చక్రమూ శారమనే ధనుస్సూ - కౌమోదకి అనే గదా దండమూ ధరించి సగుణంగా మనకు సాక్షాత్కరిస్తాడు కూడా. అవి ఆయన చేతుల్లో దివ్యాయుధాలైతే మనకూ ఉన్నాయి ఇంద్రియాల రూపంలో శంఖం మన కర్ణం- నందకం చక్షుస్సు చక్రం మనస్సు-శార్వం ప్రాణం, గద వాక్కు |
రథాంగపాణిః | ఇవి మన దగ్గరే ఉన్నా శరీరమనే రథమూ ఈ ఇంద్రియాలనే సామగ్రి వీటి ప్రవృత్తి నివృత్తులు రెండూ ఆయన చేతిలో ఉన్నాయి. |
అక్షోభ్యః సర్వప్రహరణా యుధః |
వాటి సహాయంతో శ్రవణ మనన దర్శనాదులు చేయకపోతే అవే శంఖచక్రాదులైన దివ్యాయుధాలుగా మారి మనల నందరినీ ప్రహరణం చేస్తాయి. వాటి నెదుర్కొనలేము. శ్రద్ధాళువులమై సాధన చేశామో సర్వమైన సంసార బంధాలనూ ప్రహరణం చేసి అక్షోభ్యమైన ముక్తిని ప్రసాదిస్తాయి. |
Page 66