నామం | అంతరార్థము |
---|---|
మహాశృంగః కృతాంతకృత్ |
వాటికి కూడా అతీతమైన తురీయమనే శృంగంలో మెలగుతూ-కృతమైన ఈ మొత్తానికి, అంతకృత్ - అంతం చేస్తున్నదదే. |
మహావరాహః గోవిందః సుషేణః కనకాంగదీ |
అలాంటి పరమాత్మే మహావరాహమై గోవిందః ఈ పృథివితో సాంగత్యం పెట్టుకొని సుషేణ చరాచరాలనే పెద్ద సైన్యాన్ని కని కనకాంగదీ, నామరూపాలనే ఈ కనకమే అంగద ఆభరణాలుగా ధరించాడు. హిరణ్యగర్భుడే మహావరాహం. |
గుహ్యః గభీరః గహనః |
ఈ ప్రవర్తనే ఎవరికీ అంతుపట్టదు. గోప్యమది. చాలా లోతైనది. అంభోనిధి అని గదా నామం, అంభోనిధి గనుకనే గంభీరం. అంత గంభీరమైనదెప్పుడూ గహనమే. మనసుకు కూడా అతీతం. అచింత్యం. |
గుప్తః చక్రగదా ధరః |
అంత గుప్తమైనదా పరమార్థం. చక్రంలాగా తిరుగుతోంది మానవుడి మనసు. గదా అంటే చెప్పే మాట. ఆలోచించే మనసు ఆడుకొనే మాట రెండూ ఆయన చేతిలోనివే. |
వేధాః స్వాంగః అజితః కృష్ణః |
మనమేది చేయాలన్నా ఆయనే విధించాలది. ఆయన తాలుకు అంగమే ఈ మానవుడు. అంగి ఆయన, అంగం మనం, అంగ మెప్పుడూ అంగిని అతిక్రమించి పోలేదు. దీనిచేత జితం కాదది. మీదు మిక్కిలి అదే దీన్ని ఇటూ అటూ లాగగలదు (కృష్ణ). |
దృఢః సంకర్షణః అచ్యుతః |
దృఢంగా లాగగలదు. అటుగాని ఇటుగాని, సాధకులకైతే సంకర్షణుడు. తనవైపే చక్కగా లాగుకొంటాడు. అలా లాగు కొంటే ఇక ఆయనకు లాగా మనకూ చ్యుతిలేదు అచ్యుతులమే. |
వరుణః వారుణః |
సాధకులకు కావలసినదంతా వర్షిస్తాడు (వరుణ) మార్గంలో అంత రాయాలేవి వచ్చినా వారిస్తాడు. (వారుణ) తాపత్రయాన్ని |
Page 43