నామం | అంతరార్థము |
---|---|
ఇష్టః అవిశిష్టః శిష్టేష్టః |
జయించలేక వీటిచేత జితుడైనవాడు నరుడే. వీడిచేత మరలా ఇష్ట వెదకబడుతున్నాడా నారాయణుడు. అలాగని ఈ నరుడి కన్నా విశిష్టుడు కాడు. అవిశిష్టుడే, అభిన్నుడే. ఈ అభేదాన్ని గుర్తించిన శిష్టులే అలా వెదకి పట్టుకోగలరు. |
శిఖండీ నహుషః వృషః |
పట్టుకొని దాన్నే ఒక కిరీటంగా (శిఖండ) ధరిస్తాడు శిష్టుడు. అలా ధరించమనే మౌనంగా మనకు బోధిస్తున్న దాతత్త్వం, అందుకోస మీ సంసారం తోడి తగులం నహి చేసుకొని నహుషుడవు కమ్మంటున్నది. వృష అప్పుడే నిజమైన సుఖాన్ని వర్షిస్తానంటున్నది కూడా. |
క్రోధహా క్రో ధకృత్ కర్తా |
అలాంటి ప్రయత్నం చేస్తూ పోతేనే జీవుడి మీద ఆగ్రహం చూపడు. క్రోధం వదిలేస్తాడు. లేకుంటే అంతా ఆగ్రహమే. అంతా మనమీద కోపమే. నిగ్రహానుగ్రహాలకు రెంటికీ కర్త ఆయన. |
విశ్వబాహుః మహీధరః |
అంతా మనకివ్వగలడు. విశ్వబాహువులున్నాయాయనకు. ఎంత ఇచ్చినా ఇవ్వవచ్చు. లేదా ఆగ్రహిస్తే ఇవ్వకుండా వెనుకకు తీసుకోగలడా బాహువులు. అప్పుడవి మహీ శక్తిరూపంగా తానే ధరించి ఉంటాడు. వ్యక్తమై బయటపడదు. |
అచ్యుతః ప్రథితః |
అసలది స్వరూపంగా అచ్యుతం. తన స్థానం నుంచి తానెప్పు డూచ్యుతి పొందలేదు. పొందకున్నా పొందినట్టు చేసినట్టు ఒక ప్రథ ఏర్పడిందాయనకు. దానితో ప్రథితుడయినాడు. |
ప్రాణః ప్రాణదః వాసవానుజః అపాం నిధిః |
ఆయన చలిస్తే ప్రాణం. అది ఈ జీవుడి కందజేస్తే ప్రాణదుడు. ఈ జీవుడే శరీరంలో వసించే వాసవుడు. ఈ వాసవుణ్ణి అనుసరించి ఆయనా ఈ శరీరంలోనే జన్మించాడు. కాబట్టి |
Page 30