నిగ్రహం మానసమైన తపస్సు. ఇదంతా సాత్త్వికమే. దేశ కాల పాత్రల యోగ్యతను గమనించి చేసేది సాత్త్వికమైన దానం. ఇలా సత్త్వగుణాను గుణంగా సాగినప్పుడే అది జీవితానికి అన్ని రంగాలలో జయాన్ని చేకూరుస్తుంది. తుదకు ఓం తత్సత్ అని ఏది చేసినా ఆ బ్రహ్మ చింతనే మానవుడి శ్రద్ధా భక్తుల కనుగుణమైన మోక్ష ఫలాన్ని ప్రసాదిస్తుందని గీత ఇచ్చే హామీ.
మోక్షసన్న్యాస యోగం
ఇంతకూ మోక్షమనే ఫలాన్ని రుచి చూడాలంటే దానికి సన్న్యాసమనేది ఆవశ్యకం. సన్న్యాసమంటే వదలుకోటం. కాషాయ కమండలు ధారణ కాదు. మనస్సన్న్యాసమే చెబుతుంది గీత బాహ్యసన్న్యాసం కాదు. అంచేత వదలుకోవలసింది కర్మ కాదు. ప్రతి కర్మ నేను చేస్తున్నా ననే కర్తృత్వమూ - ఇది నాకు తప్పకుండా ఫలితమివ్వాలనే భోక్తృత్వమూ వీటినీ వదలుకోవలసింది. వీటికి అహం మమలని పేరు. ఇవే సంసారమంటే.
కాని అదైనా ఎలా వదలుకోటం. సాధ్యమా. సాధ్యమే. సర్వభూతేషు యేనైకం భావం. మనం లావాదేవీ పెట్టుకొన్న ప్రతి విషయంలోనూ అవిభక్తంగా వ్యాపించి ఒకటుంది.
Page 63