#


Index

ప్రస్థానత్రయ సారము

క్షేత్రమో. అది ఏదో గాదు. ఈ క్షేత్రజ్ఞుడి విభూతి. దాని వ్యక్తమైన రూపమే. క్షేత్రజ్ఞుడంటే ఆత్మ చైతన్యం. అది దానిపాటికది నిరాకారం. అవ్యక్తం. అదే సాకారంగా వ్యక్తమయి కనిపిస్తే దాన్నే మనం క్షేత్రమంటున్నాము. ఆకాశం మొదలు మానవుడి మనస్సు దాకా అంతా క్షేత్రమే. ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడి ప్రభావమే గనుక అన్యం గాదు. అదే ఇది ఇదే అది. సచయో యత్ప్రభావశ్చ అని ఒక్క మాటలో బయటపెట్టాడీ రహస్యం వ్యాస భగవానుడు. అందులో యః అంటే ఆత్మ. యత్ప్రభావః అంటే దాని విభూతి అయిన ఈ అనాత్మ ప్రపంచం. విభువును విడిచి విభూతిని విభూతిని వదలి విభువును పట్టుకోరాదు. అది ద్వైతం. రెండూ కలిపి క్షేత్రజ్ఞుడి స్వరూపాపంగా దర్శిస్తే అది అద్వైతం. క్షేత్రంలో అంతర్బహిశ్చ క్షేత్రజ్ఞుడే వ్యాపించి ఉన్నప్పుడిక క్షేత్ర మెక్కడిది. క్షేత్రంగా కూడా కనిపిస్తూన్న దదే నని ఏకస్థం చేసి చూడాలి. అదే బ్రహ్మానుభవం అని చాటుతున్నది గీత.

గుణత్రయాధ్యాయం

  అయితే వస్తు సిద్ధంగా అంతా జ్ఞాన స్వరూపమైన ఆత్మే అయినా అదే జ్ఞేయమైన అనాత్మగా కనపడే సరికి దాన్ని గుర్తించక ఇదే సత్యమని దీన్ని పట్టుకొని సతమత మవుతున్నారు. దీనివల్ల కలిగే సుఖదుఃఖాదులను భవించలేక

Page 57

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు