#


Index

ప్రస్థానత్రయ సారము

సృష్టిలో ఏదీ లేదు. నీవు నన్ను ఏయే భావాలలో ధ్యానించాలని అడిగావు కాబట్టి ప్రత్యేకించి అలా చెప్పవలసి వచ్చిందని మరలా సంజాయిషీ ఇస్తాడాయన అర్జునుడికి.

విశ్వరూపాధ్యాయం

  అయితే ఇదంతా భగవద్విభూతి అని ఎంత చెప్పినా గ్రహించలేడు మానవుడు. దానికి కారణాలు రెండే. ఒకటి ఇదంతా ప్రపంచమని మామూలు దృష్టితో చూస్తున్నామే గాని అంత కన్నా విశేషంగా చూడలేక పోతున్నాము. రెండు ఈ భూమండలంలో ఎక్కడో ఒకచోట ఒక కాలంలో ఏ కొన్నింటితోనో సంబంధం పెట్టుకొని చాలా పరిమితమైన దృష్టితోనే జీవిస్తున్నాము గాని దేశకాల వస్తువులన్నీ కలుపుకొని అఖండమైన దృష్టితో చూడటం లేదు మనం. అందువల్ల అఖండమైన విశ్వమెక్కడో ఉంది మనకు కనపడటం లేదు. ఎక్కడైనా ఒక మహానుభావుడొక గారడీ చూపినట్టు దాన్ని మనకు చూపితే బాగుండననే గొప్ప కుతూహలం ప్రతివాడికీ.

  కాని వాస్తవంలో మనం చూస్తున్నదంతా విశ్వరూపమే విభూతే. విభువు తాలూకుదే విభూతి. విశ్వేశ్వరుడిదే ఈ విశ్వరూపమనే అవగాహన లేదు మానవుడికి. విశ్వమనేది

Page 53

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు