#


Index

ప్రస్థానత్రయ సారము

వీటిలో. ఆ మాటకు వస్తే వీటిలో కూడా అది లేదు. అంటే ఉన్నదదే మరేదీ కాదని భావం. అయినా ఇవి కనిపిస్తున్నా యంటే అదే ఇన్ని రూపాలలో దర్శనమిస్తున్నది. అందులో నుంచే జన్మించి అందులోనే లయమవు తుంటాయి. దాని శక్తి అలాంటిది.

  ఆశక్తి ప్రభావంతో నేనొక రూపం ధరించి అవతరిస్తుంటే నేనా అవతారమేనని అక్కడికే చూచి నన్నవ మానిస్తారు మూఢులంటాడు పరమాత్మ. ఎవరో ఉంటారు మహాత్ములు. వారు జ్ఞానయజ్ఞంతో నన్ను యజనం చేస్తుంటారు. అనన్య భావంతో పట్టుకొంటారు నన్ను. వారికే రూపం చూచినా ఏ క్రియ చూచినా అందులో అవి కనపడవు. ఆత్మే స్ఫురిస్తుంటుంది. ఆత్మ సర్వత్ర సమంగా వ్యాపించి ఉంది. అలాంటి భావనతో బ్రతికితే చాలు. చివరకు సర్వాత్మ భావాన్నే అందుకొని తరిస్తారు.

విభూతియోగం

  ఇంకా ఒక మాట చెబుతున్నాను వినమంటాడు. భగవానుడు. నాస్వరూపం దేవతలకు ఋషులకే అంతుపట్టటం లేదు. కారణం అందరికీ ముందే ఉన్నాను నేను. నాకు జన్మ లేదు మరణం లేదు. ఇలా ఎవరైతే ఆత్మ స్వరూపాన్ని గుర్తిస్తారో వారూ అదే అయిపోగలరు.

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు