ఫలిత మిస్తుందో లేదో. ఇవ్వకపోతే ఏమిటి మనగతి అని కూడా బెంబేలు పడరాదు. సర్వాత్మ భావం సిద్ధించే వరకూ అభ్యాసం సాగుతూ పోవాలి. ఈ జన్మలో అది ఫలించక పోతే మరొక జన్మలో. ఆ జన్మలో కాకుంటే మరో జన్మలో తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే చేసింది వృధా పోదు. జన్మలనేవి అభ్యాసం కోసమే ఉన్నాయి. ప్రతి జన్మలో కొంత కొంత ప్రయత్నిస్తూ పోతే ఆ సంస్కారం తరువాత జన్మకు కలిసి వస్తుంది. అది ఏజన్మకో ఒక జన్మకు పరిపాకానికి వచ్చి సర్వాత్మ దర్శనం తప్పకుండా లభిస్తుంది. భగవానుడిచ్చే హామీ ఇది. ఇదీ ఆత్మ సంయమం మనకు చెప్పే మాట.
జ్ఞాన విజ్ఞాన యోగం
పరమాత్మ ఈశ్వరుడు బ్రహ్మమని వర్ణించటమే గాని వాటి స్వరూపమేమిటో పూర్తిగా చెప్ప లేదింత వరకూ. ఇప్పుడా స్వరూపాన్ని బయట పెడుతున్నదీ అధ్యాయం. స్వరూపమూ విభూతీ రెండున్నాయి పరమాత్మకు. అందులో స్వరూపం నిర్గుణం. విభూతి సగుణం. గుణాలంటే సత్త్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలు. ఈ ప్రకృతి ఆయన శక్తే - సగుణంగా బయటపెడితే ఆయన ఈశ్వరుడు. అప్పుడీ చరాచర ప్రపంచమంతా ఆయన విభూతి లేదా విస్తారం.
Page 46