#


Index

ప్రస్థానత్రయ సారము

సాధనాధ్యాయం

  అవిరోధమయింది. ఇక సాధన. జీవ జగదీశ్వరులు ముగ్గురూ చైతన్యరూపంగా ఏకమేనని తీర్మానించారు. అయితే ఇక సాధన ఏమిటి. ఎలా చేయాలి. ఎవరు చేయాలి. అని ప్రశ్న. జీవుడే చేయాలన్నారు. వీడు ఈశ్వరుడే నన్నారు గదా. నిజమే - వస్తుతః ఈశ్వరుడే కాని అలా భావించటం లేదీ జీవుడు. మరేమని భావిస్తున్నాడు. నేను శరీరమూ మనస్సూ ప్రాణమే ఇంతకన్నా వేరుగా లేనని భావిస్తున్నాడు. ఈశ్వరుడయి కూడా కానని భావించట మెలా జరిగింది. అనాది కాలం నుంచి వస్తున్న అవిద్య లేదా అజ్ఞానం వల్లనని జవాబిస్తారు అద్వైతులు.

  అజ్ఞానమంటే జ్ఞానం లేకపోవటం కాదు. అంతో ఇంతో జ్ఞానముంది మనకిప్పుడు. అయితే అది పరిపూర్ణంగా లేదు. సర్వవ్యాపకంగా ఉన్నాను నేనని భావిస్తే అది పూర్ణ జ్ఞానం. అలా కాక ఒక శరీరం మేరకే ఉన్నానని భ్రమపడితే అది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానమే అజ్ఞానం. అంటే సర్వవ్యాపకమైన జ్ఞానం లేక పోవటం. అది లేకపోతే నేమి. ఇది ఉంది గదా అంటే - దీనివల్ల ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవిక తాపత్రయమను భవించ వలసి వస్తున్నది. ఇదే సంసార

Page 32

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు