అవిరోధం
అయితే ఇది కపిలాది అచేతన కారణ వాదులు గాని ఈశ్వర కారణ వాదులైన ద్వైతులు గాని ఒప్పుకోలేదు. కేవలం చేతనమే కారణమైతే అందులో నుంచి దానికి విలక్షణమైన జడ ప్రపంచమెలా వచ్చిందని వారి వాదం. దానికి బాదరాయణుల సమాధానమేమంటే రాలేదు వాస్తవంలో ప్రపంచం. ఇది ఆరంభం కాదు Creation. లేదా పరిణామమూ Evolution కాదు. అలాగైతే పరమాత్మ దెబ్బతింటాడు. నిరాకారమూ సర్వవ్యాపకం గదా పరమాత్మ అంటే. అలాంటప్పుడు రెండవ పదార్థమెలా రాగలదు. రెండవది వాస్తవమే అయితే పరమాత్మ సర్వవ్యాపకమెలా కాగలడు. కనుక ఆరంభ పరిణామాలు చెప్పగూడదు.
మరి ఎలా వచ్చిందీ ప్రపంచం. ఇది కేవలం వివర్తం. అంటే సృష్టి జరిగినట్టు చేసినట్టు భాసిస్తున్నదే గాని వాస్తవంగా జరగలేదు. మరి ఈ భాసిస్తున్నదెవరు. ప్రపంచం కాదు. పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు. సచ్చిద్రూపంగా అది స్వరూపావస్థ. నామరూపాత్మకంగా అది విభూతి Mainfestation. వస్తువొక్కటే. రెండవది వస్తువు గాదు. దాని విస్తారం. సువర్ణమొక్కటే. కంటెలు కమ్మలు కాసుల
Page 30