#


Index

ప్రస్థానత్రయ సారము

బ్రహ్మ సూత్రాలు

  ఉపనిషత్తులు శ్రవణ ప్రధానమైతే బ్రహ్మ సూత్రాలు మనన ప్రధానమని చెప్పాము. మనన మంటే విచారణ, ఉపనిషద్వాక్యాల మీదనే మననం చేశాడు బాదరాయణుడనే ఆచార్యుడు. దాని ఫలితమే ఈ బ్రహ్మసూత్రాలనే గ్రంథం. 555 సూత్రాలున్నా యిందులో. అవి నాలుగ ధ్యాయాలుగా విభజించాడు. అందులో మొదటిది సమన్వయం. రెండవది అవిరోధం - మూడవది సాధన. నాలుగవది ఫలం.

సమన్వయం

  బ్రహ్మమే ప్రపంచ సృష్టికి మూల కారణం. మరేదీ కాదని సమన్వయించి చూపాడు కాబట్టి సమన్వయాధ్యాయ మని పేరు వచ్చింది. అధాతో బ్రహ్మ జిజ్ఞాసా అనే సూత్రంతో ఆరంభ మవుతుంది. బ్రహ్మ తత్త్వాన్ని గురించి అన్వేషణ చేయాలి. ఎందుకు. అదే పరమ పురుషార్ధం. దాన్ని తెలుసుకొంటే చాలు. సమస్తమూ తెలిసిపోతుంది. ఎలాగ. సృష్టిని బట్టే సృష్టి కర్తను గ్రహించాలి ఎప్పుడేగాని. ప్రపంచ సృష్టికి బ్రహ్మమే కర్త.

  అదేమిటి. ప్రకృతే కారణమన్నాడు కపిలుడు. పరమాణువులే కారణమన్నాడు కణాదుడు. అంతకు ముందు లేదీ ప్రపంచం. తరువాత వచ్చింది కాబట్టి అభావమే

Page 28

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు