#


Index

ప్రస్థానత్రయ సారము

ఎక్కుపెట్టిన బాణం బ్రహ్మమే దానికి లక్ష్యమని భావించి దాన్నే భేదించి పట్టుకోవాలి మనస్సుతో నిరంతరం. అదే మోక్షదాయకం.

మాండూక్యోపనిషత్తు

  ఓంకారమంటే అది ఒక శబ్దం. శబ్దమెప్పుడూ అర్థాన్ని చెబుతుంది. సంకేతమే గదా సత్యాన్ని చెబుతుంది. శబ్దం సంకేతం. ఓంకారమనేది అలాటి సంకేతమే. అందులో అ ఉ మ అని మూడక్షరాలున్నాయి. మూడింటికీ మాత్రలని పేరు. మాత్ర అంటే కొలిచేది. ఇందులో అ జీవుడి జాగ్రదవస్థను ఉ స్వప్నావస్థను మ సుషుప్తినీ కొలుస్తాయి. అవి కొలుస్తుంటే ఆత్మ చైతన్యం వాటిచేత కొలవబడుతుంటుంది. వాటికి పాదాలని పేరు. స్వతహాగా కొలత లేని ఆత్మ ఈ కొలమానంతో జీవరూపంగా మారి మూడవస్థ లనుభవిస్తున్నది. ఇదే సంసార బంధం. మాత్రలు ఆలోచనలైతే పాదాలు వాటి తాలూకు బాహ్యరూపాలు. Ideas and Things. ఇలాంటి వాచ్యవాచక సంబంధమనే లావాదేవీ ఉన్నంత వరకూ సంసార క్లేశం తప్పదు మనకు.

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు