ప్రశ్నోపనిషత్తు
ఇది వినటాని కెంత రమణీయంగా ఉన్నా ఇందులో ఏదైనా ఉపపత్తి చూపితే కాని నమ్మకం పుట్టదు సాధకుడికి. ఉపపత్తి అంటే హేతువు Reason. హేతువే కాక దృష్టాంతం కూడా చూపాలి మనకు శాస్త్రం. ఆ బాధ్యత వహిస్తుంది. ప్రశ్నోపనిషత్తు. ఆరు ప్రశ్నలు వేశారు ఆరుగురు మహర్షులు పిప్పలాదుడనే బ్రహ్మర్షిని. అందులో మూడు ప్రాణానికీ మూడు మనస్సుకు సంబంధించినవి. మనస్సులోనే జ్ఞానమనేది ఉదయిస్తుంది. అదే అనుభవానికి కూడా నిలయం. మనసు జ్ఞానశక్తి అయితే ప్రాణం క్రియాశక్తి. సాధన అంతా క్రియే. కాబట్టి మొదట ప్రాణ విషయం నడచింది. తరువాత ఈ క్రియ ద్వారా మనసులో ఏర్పడవలసిన ఆ జ్ఞానమేదో బోధిస్తుం దుపనిషత్తు.
ఎలాగంటే జనన మరణాదులైన భావాలన్నీ నామరూపాల సంపర్కం వల్లనే కలుగుతున్నాయి. ఈ నామరూపాలనే కళలని పేర్కొన్నది. ఇది ప్రాణం మొదలుకొని నామం దాకా పదహారు. షోడశ కళలని పేరు వీటికి. కళ అంటే ఒక శకలం. ఖండం, అఖండమైన ఆత్మ చైతన్యమే 16 కళలుగా కనిపిస్తున్నది మనకు. వీటితో
Page 15